సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఎంఈఓ విద్యాసాగర్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండలంలో ఎంపిక చేసిన ఉత్తమ ఉపాధ్యా యులను సన్మానించారు. అనంతరం ఏంఈఓ మాట్లాడుతూ.. ఉపాద్యాయ వృత్తి పవిత్రమైనదని, విద్యార్థులను మార్గదర్శకులుగా తీర్చిదిద్దేది ఉపాద్యాయులు మాత్రమే అని పేర్కొన్నారు.