చంద్రశేఖరపురం మండలంలోని చింతపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడంతోపాటు వారి ఉన్నతికి తోడ్పాటును అందించే గురువులను ప్రతి విద్యార్థి గౌరవించవలసిన అవసరం ఉందన్నారు. సమాజంలో గురువులకు ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.