విశాఖ ఉక్కును ఈవోఐ పేరుతో 46 ముక్కలుగా చేసి, ప్రైవేటీకరించే కుట్రలను కేంద్ర మోడీ ప్రభుత్వం నిలిపివేయాలని, రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఈ కుట్రలను చిత్తశుద్ధితో నిలువరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1 నుండి 11 వరకు జిల్లా వ్యాప్త క్యాంపెయిన్, 11న పాత గాజువాకలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సోమవారం సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం. జగ్గు నాయుడు తెలియజేశారు.