జిన్నారం మున్సిపాలిటీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ప్రారంభమయ్యాయి. బుధవారం సాయంత్రం నుంచి గ్రామంలోని పలు మండపాలలో గణనాథుడు భిన్నమైన రూపాలలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రతి మండపంలో ప్రత్యేక అలంకరణలు, విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించిన గణనాథుడిని దర్శించేందుకు భక్తులు తరలివస్తున్నారు. పబ్లిక్ న్యూస్ ప్రేక్షకుల కోసం మున్సిపల్ లో కొలువుదీరిన గణనాథుల అద్భుత రూపాలను ఇలా దర్శించుకోండి.