బాలానగర్ మండలంలోని పెద్దరేవల్లి గ్రామంలో ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం పెళ్లి జరిగింది. ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా.. పెళ్లికి వచ్చిన క్రికెట్ అభిమానులు పెళ్లిలో ఏర్పాటుచేసిన భారీ స్క్రీన్పై క్రికెట్ మ్యాచ్ను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా పలువురు క్రికెట్ అభిమానులు మాట్లాడుతూ.. ఈరోజు కచ్చితంగా న్యూజిలాండ్ పై భారత్ భారీ స్కోర్తో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.