అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని తగ్గుపర్తి గ్రామంలో బుధవారం ఉచిత వైద్య శిబిరాన్ని శ్రీరంగాపురం పీహెచ్సీ వైద్యాధికారి రవిశంకర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరానికి వచ్చిన రోగులకు వివిధ పరీక్షలను నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. దోమల నివారణకు డ్రైడే పాటించాలని దోమ తెరలు వాడాలని వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించాలని వైద్యాధికారి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్వో జాఫర్, రామాంజి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.