జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో 3,500 కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించినట్లు మంచిర్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ వీరయ్య శనివారం సాయంత్రం తెలిపారు. 30 సివిల్ దావాలు, 15 మోటారు వాహనం పరిహారం కేసులు, 339 క్రిమినల్ కేసులు, 43 సైబర్ క్రైమ్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 45 ప్రిలిటిగేషన్ కేసులు, ఇతర 3,100 కేసులు పరిష్కరించడం జరిగిందని తెలిపారు. రాజీ మార్గంతో ఇరువర్గాల వారు కేసుల నుండి విముక్తి పొందాలని, రాజీమార్గమే రాజ మార్గమని పేర్కొన్నారు.