*కాకినాడ జిల్లా పెద్దాపురం పాసిల వీధిలో ట్రాన్స్ఫార్మర్ పై విద్యుత్తు లైన్ మరమత్తులు చేస్తుండగా విద్యుత్ షాక్ తో జూనియర్ లైన్ మ్యాన్ కే రామకృష్ణ అక్కడిక్కడే మృతి చెందాడు.మరో లైన్ మెన్ యాల్ల చిన్నిబాబుకు తీవ్రగాయాలు అవ్వడంతో పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.లైన్ క్లియరెన్స్ (LC ) ఇచ్చిన తరువాత సంబంధిత లైన్ మ్యాన్ పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ ఘటన జరిగినట్టు సంబంధిత సహా ఉద్యోగులు వాపోతున్నారు.ఇదే విధంగా సంవత్సరం క్రిందట కాంట్రాక్టు లైన్ మ్యాన్ చనిపోవడం జరిగిందని వారు తెలిపారు. ఈ సంఘటనపై పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.