విశాఖ తూర్పు ఆరిలోవ జివియంసి 13వ వార్డు శ్రీకాంత్‌నగర్ జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం కాలనీలో శుక్రవారం మధ్యాహ్నం 3.30 ని॥ల సమయంలో బొట్ట పృధ్వీరాజ్ (24) యువకుడు మీద మేడ ప్రసాద్ అనే వ్యక్తి కత్తితో దాడిచేశాడు. పృద్వి కు వీపుమీద తీవ్రమైన గాయం అయింది. వెంటనే స్ధానిక ప్రజలు ఆరిలోవ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ వై. కృష్ణ సంఘటనా స్ధలానికి చేరుకొని క్లూస్ టీంతో వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. బొట్ట పృద్వీరాజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. నిందితుడు మేడ ప్రసాద్‌పై కేసు నమోదు చేశామని నిందితుని కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు.