తాడేపల్లిగూడెంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి క్షేత్రం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 58వ శ్రీ వాసవి దేవి శరన్నవరాత్ర మహోత్సవాల సందర్భంగా ఆహ్వాన శుభ పత్రికను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కొర్లేపర శ్రీరామచంద్రమూర్తి, గౌరవాధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు పాబోలు రాజగోపాలరావు, ఉత్సవ కమిటీ చైర్మన్ వబిలి శెట్టి నటరాజు, ప్రధాన కార్యదర్శి నున్న బాలత్రిపుర సుందరావు, కోశాధికారి బోగవిల్లి రమేష్, ఆలపాటి కృష్ణకుమార్, రథోత్సవ కమిటీ చైర్మన్ నారాయణ రాంబాబు పాల్గొన్నారు.