నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం మూసి ప్రాజెక్టుకు ఇటీవల కురుస్తున్న వర్షాలకు జలకళ ఏర్పడింది. ఈ సందర్భంగా గురువారం ప్రాజెక్టు చుట్టూ అరుదైన విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన ఈ పక్షులు పర్యాటకులను పక్షి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. ప్రాజెక్టు పరిసరాల్లోని అహల్లాదకరమైన వాతావరణం సమృద్ధిగా లభించే ఆహారం కారణంగా ఇవి ఇక్కడ స్థిరపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.