కనిగిరి: వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతులను రాజుగా చూసి గౌరవం ఇచ్చారని ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. కనిగిరిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... గత వైసిపి ప్రభుత్వం లో రైతులకు ఉచిత బీమా సౌకర్యం కల్పించామని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రైతులకు కనీసం ఉచిత బీమా సౌకర్యం కూడా కల్పించలేక విఫలమైందన్నారు. రైతులకు సరిపడినంత యూరియాను ప్రభుత్వం సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.