కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం శనివారం తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, స్టేషన్ ఆవరణ లోని స్వాధీనం చేసుకున్న వాహనాలను పరిశీలించారు. హాజరులో ఉన్న సిబ్బందితో మాట్లాడి వారికే కేటాయించిన విధుల గురించి తెలుసుకున్నారు. మండలంలోని రౌడీషీటర్లు హిస్టరీ షీటర్ల పై ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని, ప్రతి నెల వారికి సంబంధించి నూతన సమాచారం సేకరించి నమోదు చేసుకోవాలని ఆదేశించారు. నూతనంగా వీధుల్లో చేరిన కానిస్టేబుల్ లకు పోలీస్ స్టేషన్లో అన్ని రకాల విధుల గురించి నేర్చుకోవాలని సూచించారు.