గుంటూరు నగరంపాలెంలోని ఫుట్ పాత్ వెండర్లు శనివారం గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖరిన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నో ఏళ్లుగా తాము ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నామని, అయితే జీఎంసీ అధికారులు తమ దుకాణాలు తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు చిరు వ్యాపారమే జీవనాధారమని, స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అధికారులతో మాట్లాడతానని పెమ్మసాని వారికి భరోసా ఇచ్చారు.