సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా ఈనెల 7వ తేదీన శ్రీశైలం మహానంది ఆలయాలు మూసివేస్తున్నట్లు ఆలయ ఈవోలు తెలియజేశారు. ఈనెల 7వ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు శ్రీశైలం ఆలయం మూసివేస్తున్నట్లు, అలాగే మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాలకు మహానంది ఆలయం మూసివేస్తున్నట్లు, తిరిగి ఎనిమిదో తేదీ తెల్లవారుజామున 4 గంటలకు శార్రోత్తకాంగా పూజాదికాలు నిర్వహించి, అనంతరం తిరిగి ఆలయాలు తెరిచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు శ్రీశైలం, మహానంది దేవస్థానం ఈవోలు తెలియజేశారు.