అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం పెద్దేరు జలాశయం నుండి బుధవారం నాడు 458 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఏఈ సుధాకర్ రెడ్డి తెలిపారు. జలాశయం సాధారణ నీటి మట్టం 137 మీటర్లు కాగా, ప్రస్తుతం 133.90 మీటర్లకు చేరుకుంది. 145 క్యూసెక్కుల వరద నీరు చేరడంతో స్పిల్ వే ద్వారా 438 క్యూసెక్కులు, రాచకట్టు ద్వారా 10, ఆర్ఎంసి ద్వారా 10 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భారీ వర్షాలే దీనికి కారణమని అధికారులు పేర్కొన్నారు.