కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు యూరియా అందడం లేదంటూ మంగళవారం ధర్నా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు రాజయ్య మాట్లాడుతూ యూరియా కోసం రైతులు కష్టాలు పడుతున్న కూడా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు. యూరియా కోసం రాత్రి పగళ్ళు వర్షంలో కూడా రైతులు లైన్లో నిలబడ్డా కూడా ఒక బస్తా కూడా సరిగా అందడం లేదంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో విఫలమైందని ఆరోపించారు. వెంటనే రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.