అరకులో హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని మంత్రి గుమ్మడి సంధ్యా రాణి అన్నారు. మంగళవారము గిరిజన కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ 'హైడ్రో ప్రాజెక్టుతో గిరిజనులకు ఇబ్బందులు కలిగితే ఆలోచిస్తాం. ప్రయోజనం ఉంటే మాత్రం ముందుకెళ్తాం' అని స్పష్టం చేశారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలు, గిరిజన స్వచ్ఛంద సంస్థల అభిప్రాయాలు తెలుసుకుంటామన్నారు. సుమారు రూ.6వేల కోట్లతో ఈ ప్రాజెక్టు ప్రతిపాదించబడిందని తెలిపారు.