కనిగిరి: తన సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు ఆరాధ్యుడుగా దివంగత మాజీ సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి నిలిచిపోయారని కనిగిరి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. మంగళవారం వైయస్సార్ వర్ధంతి సందర్భంగా కనిగిరిలోని చెక్పోస్ట్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నారాయణ యాదవ్ నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో నారాయణ యాదవ్ మాట్లాడుతూ..... విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, ఇల్లు లేని పేదలకు పక్కా గృహాలు నిర్మించి ఇచ్చిన ఘనత వైయస్సార్ కే దక్కుతుందన్నారు. అందుకే అన్ని వర్గాల ప్రజలకు ఆయన ఆరాధ్యుడుగా నిలిచారన్నారు