Udayagiri, Sri Potti Sriramulu Nellore | Aug 29, 2025
ఉదయగిరి మండలం అప్పసముద్ర గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనం ఊరేగింపులో అప్పశృతి చోటు చేసుకుంది. టపాసులు పేలి పదిమంది చిన్నారులు గాయపడ్డారు. వారిలో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో అందరినీ వింజమూరు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నిమజ్జన సమయంలో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. నిప్పురవ్వల ఎగిరి ట్రాక్టర్ లో ఉన్న టపాసులు మీద పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం చిన్నారులకు చికిత్స అందుతుంది.