లింగంపేట మండలం మోతేలో ఇందిరమ్మ ఇండ్లను స్పెషల్ ఆఫీసర్, డీఆర్డీఏ పీడీ సురేందర్ మంగళవారం పరిశీలించారు. లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఇండ్లు నిర్మించుకునే వారికి సకాలంలో బిల్లులు, ఇసుక, వంటివి త్వరగా అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మహిళా సంఘాలకు మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలను అందజేశారు. అనంతరం మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో పండగ జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నరేశ్ పాల్గొన్నారు.