Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 25, 2025
పేదలకు రేషన్ కార్డు సంజీవని లాంటిది అని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణం 6వ వార్డు కొనదిన్నే గిరిజన కాలనీలో సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ జరిగింది. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఆరోగ్యశ్రీ ఇతర ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డ్ ఏ ప్రామాణికం అని అన్నారు.అర్హులైన పేదలందరికీ ఈ కార్డ్ అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.