మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో ఉపాధి కూలీలు శనివారం మధ్యాహ్నం 3:00 లకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు సంపత్ నాయక్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనిచేసినటువంటి కూలీలకు వేతనం చెల్లించకపోవడం బాధాకరమన్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కూలీలపై మొండి వైఖరి మానుకోవాలన్నారు. ఇప్పటికైనా ఉపాధి హామీ పనిచేసిన కూలీలకు తక్షణమే వేతనం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు..