అన్నమయ్య జిల్లా. తంబళ్లపల్లె నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి .జయచంద్ర రెడ్డి పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగు యువత రాజంపేట ఉపాధ్యక్షులు చంద్ర సోమవారం కోరారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక టిడిపి ఇన్చార్జ్ పై కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారు పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.