కాగజ్ నగర్ మండలం భారెగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవసరాల కోసం పాఠశాల పక్కనే ఉన్న ప్రధాన రహదారికి ఇరువైపులా వెళ్లాల్సి వస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నుండి నిధులు రాకపోవడంతో ఉపాధ్యాయులు తమ సొంత డబ్బులతో మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు,