మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి రోడ్డులో గల సీనియర్ సిటిజెన్స్ డే కేర్ సెంటర్ లో జిల్లా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రత్యెక సమవేశాన్ని సంఘం జిల్లా అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొగ్గు విశ్రాంత పెన్షన్ దారుల సమస్యలను పరిష్కరించాలని కోల్ ఇండియా అల్ పెన్షనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలకత్తా కోల్ ఇండియా కార్యాలయం ఎదుట ఈ నెల 15న జరిగే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.