హసన్ పర్తి టిటిడిసిలో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను త్వరగా మొదలు పెట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. బుధవారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కార్యాలయ సమీపంలోని టీటీడీసీ ప్రాంగణంలో రూ. 5కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు మొదలుపెట్టిన ఇందిరా మహిళా శక్తి భవనం పురోగతిని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.