నల్గొండ జిల్లా, గుండ్లపల్లి (డిండి) మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఓ అవివాహిత యువతి ఇంట్లో ఫ్యానుకు ఊరు వేసుకొని మృతి చెందింది. గురువారం సాయంత్రం పోలీసులు, మృతురాలి తండ్రి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన పెంట్ల రూప (26) అనే అవివాహిత యువతి బుధవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని మృతి చెందింది. పెళ్లి కాకపోవడంతో నిరాశకు లోనై ఈ నిర్ణయం తీసుకున్నట్లు మృతురాలి తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.