అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని కక్కలపల్లి సమీపంలో సెప్టెంబర్ 10న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా బుధవారం పదిన్నర గంటల సమయంలో బిజెపి టిడిపి జనసేన కూటమి ఎమ్మెల్యేలు పాల్గొని భూమి పూజ చేసిపనులను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకం సూపర్ హిట్ అయింది అన్న సందర్భంగా బిజెపి జనసేన టిడిపి కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను సెప్టెంబర్ 10న నిర్వహించబోతున్నామని అందుకు ఏర్పాట్లను ప్రారంభించడం జరిగిందని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కూటమినేతలంతా పాల్గొన్నారు.