ఎల్లారెడ్డి నియోజకవర్గం కాలేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా మంగళవారం రోజు ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి బి ఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ హాజరయ్యారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కాలేశ్వరం పైన చేస్తున్న కుట్రలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వరప్రదాయని కాలేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి నది జలాలను ఆంధ్రకు తరలించేందుకు చంద్రబాబుతో కలిసి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు అన్నారు.