నిర్మల్ జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఆదివారం రెండో రోజు ప్రశాంతంగా కొనసాగుతోంది. బొజ్జ గణపయ్యను పట్టణ పుర వీధుల్లో భాజభజంత్రీల మధ్య ఊరేగింపు జరిపారు. యువకులు డీజే పాటలపై నృత్యాలు చేస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్వతి తనయుడికి వీడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.