మందమర్రి పట్టణంలోని యాపల్ ఏరియాలో నివసిస్తున్న గంధం వేణు అనే యువకుడు అనారోగ్య సమస్యల కారణంగా జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. సుమారు నాలుగు సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు మరణించడంతో, అప్పటి నుండి అతని బాగోగులను అతని అన్నలు మరియు అక్క చూసుకుంటున్నారు. నిన్న రాత్రి మృతుడు తన సోదరుడు గంధం రమేష్‌తో కలిసి భోజనం చేసిన అనంతరం, నిద్రపోతానని చెప్పి తన గదిలోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.