కనిగిరి: ఆగస్టు 20 నుండి 25వ తేదీ వరకు ఒంగోలులో జరుగు సిపిఐ పార్టీ 28వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కనిగిరి నియోజకవర్గం సిపిఐ పార్టీ కార్యదర్శి సయ్యద్ యాసీన్ పిలుపునిచ్చారు. ఆదివారం కనిగిరిలో ఆయన మాట్లాడుతూ... సిపిఐ పార్టీ రాష్ట్ర మహాసభల సందర్భంగా సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో కనిగిరి పట్టణంలో భారీ బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.