అనకాపల్లి జిల్లా వి.మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గ చీడికాడ మండలం జీ. కొత్తపల్లి గ్రామంలో కురుస్తున్న వర్షాలకు మిరాశ గడ్డ వద్ద కల్వర్టు కూలిపోయింది. దీంతో ఈ రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కారణంగా రైతులు, గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. కూలిపోయిన ప్రాంతాన్ని కాలువ ప్రెసిడెంట్ కొల్లి పైడంనాయుడు, గ్రామ సర్పంచి కొల్లి సూరినాయుడు గురువారం నాడు పరిశీలించారు. ఈ విషయాన్ని అధికారులకు సమాచారం అందించారు.