సమస్యాత్మక గ్రామమైన పెద్దవడుగూరు మండలం కృష్ణపాడులో తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి బుధవారం పర్యటించారు. గ్రామసభనిర్వహించి ప్రజలతో వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఘర్షణల జోలికి వెళ్లకుండా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. చిన్నచిన్న విషయాలకు ఘర్షణలు పడకూడదన్నారు.