రంగారెడ్డి జిల్లాలో బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జనగామ జిల్లా నేలపోగులకు చెందిన బాలాజీ (19) షాద్నగర్లోని చౌదరిగుడా మండలంలోని ఓ కాలేజీలో బిటెక్ చదువుతున్నాడు. బాలాజీ తన స్నేహితుడు పవన్తో కలిసి బైక్పై చౌదరిగుడకు వెళ్తుండగా, మార్గమధ్యలో చెప్పిన ఢీకొన్నారు. ప్రమాదంలో బాలాజీ మృతి చెందాడు. పవన్ కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసు అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.