ఏలూరు జిల్లా ఏలూరులో తూర్పు పడమర లాకులు మరియు దెందులూరు సమీపంలోని వినాయక నిమజ్జనం కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతాలను ఆదివారం సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాల సమయం లో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పరిశీలించారు ఈ సందర్భంగా కొన్ని కీలకమైన జాగ్రత్తలు సూచనలు తెలియజేశారు నిమజ్జనం చేసే ప్రాంతాలలో ఈత రాని వారు ఎట్టి పరిస్థితులను నీటిలోకి దిగరాదని తల్లిదండ్రులు చిన్న పిల్లలను విగ్రహాలు ఊరేగింపులు నిమజ్జనం కార్యక్రమానికి ఒంటరిగా పంపరాదని డీజేలో అశ్లీల నృత్యాలు విగ్రహాల వద్ద అనుమతి లేదని ఇటువంటి ప్రమాదాలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ సూచించారు