నల్గొండ జిల్లా, మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలోని నిడమనూరు పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేసి స్టేషన్ పరిసర ప్రాంతాలతో పాటు లాకప్, క్రైమ్ రికార్డ్స్, జనరల్ రికార్డ్స్ లతోపాటు రౌడీషీటర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల ఫిర్యాదులలో ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఆదేశించారు.