అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని గుత్తి రోడ్డులో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న రైతు భరోసా కేంద్రంపై దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి పేరు తొలగించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేశారు. మంగళవారం వైసీపీ శ్రేణులు మార్కెట్ యార్డుకు ర్యాలీగా చేరుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి, మునిసిపల్ చైర్ పర్సన్ భవాని మాట్లాడుతూ గత సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి రైతులు కోసం మార్కెట్ యార్డ్ లో రైతు భరోసా కేంద్రం నిర్మించారన్నారు. రైతులకు వెన్ను,దన్నుగా నిలిచిన వైఎస్సార్ పేరు ఏర్పాటు చేయాలన్నారు.