వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి లో పురాతన ఆంజనేయస్వామి ఆలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన గుర్తు తెలియని వ్యక్తులు. శిధిలావస్థలో ఉన్న పురాతన ఆంజనేయస్వామి ఆలయంలో గుప్తనిధుల కోసం ఆంజనేయస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసి అక్కడి నుండి పక్కకు తొలగించి మరీ తవ్వకాల్చారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటనపై గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు వర్ధన్నపేట పోలీసులు.