చెరుకుపల్లి మండలం నడింపల్లి వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పిన ఒక కారు రోడ్డు పక్కన ఉన్న నివాస గృహంలోకి దూసుకు వెళ్లిన ఘటన సోమవారం జరిగింది. అయితే ఆ ఇంటి గోడను ఢీకొని కారు ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.వేగంగా వస్తున్న ఒక స్కార్పియో వాహనం అడ్డదిడ్డంగా వచ్చిన మరో వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి సైడ్ కాలువలోకి దూసుకు వెళ్లి పక్కనే ఉన్న ఇంటి గోడను ఢీకొంది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు