ఈ నెల 23న 4వ శనివారం స్వచ్ ఆంధ్ర - స్వర్ణాంధ్ర లో భాగంగా స్వచ్ఛాంద్రా కార్యక్రమాలకు సిద్ధంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నుండి జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం రెవిన్యూ డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, అన్ని శాఖల జిల్లా అధికారులతో స్వర్ణాంధ్ర కి పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, స్వచ్స్ ఆంధ్ర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వారం డ్రైన్ క్లీనింగ్, పారిశుధ్యం ప్రధానాంశంగా తీసుకోవడం జరిగిందని అన్నారు.