కరీంనగర్ పట్టణంలోని శ్వేత హోటల్ లో రూమ్ అద్దెకు తీసుకున్న ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. గత 14 రోజుల నుండి 215 రూమ్ ను అద్దెకు తీసుకొని బెల్లంపల్లి కి చెందిన ఎండి ముదస్సిర్ ఉంటున్నాడు. అయితే ఉరివేసుకొని మృతి చెందినట్లు హోటల్ సిబ్బందికి కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యుల సమక్షంలో మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.