హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని బంజారా భవన్ లో గురువారం జరిగిన తీజ్ ఉత్సవాల్లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. తీజ్ ఉత్సవాల్లో భాగంగా సేవలాల్ మహరాజ్ కి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బంజారా మహిళలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ నృత్యం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మన సంప్రదాయాలకు అనుగుణంగా బంజారా భవన్ లో ఘనంగా తీజ్ ఉత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. ఈ ఆచారం మన అందరి విశ్వాసమని, ప్రజల సంక్షేమం కొరకు జరిగే కార్యక్రమం అన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గం పాడి పంటలతో, మంచి సమృద్ధి వర్షాలతో వాతావరణం ప్ర