ఉల్లి రైతులకు మద్దతు ధర రూ.3000 ఇవ్వాలని ఏపీ రైతు సంఘం నేతలు బి.నాగన్న, ఎస్.మధుసూదన్ ఓర్వకల్లు తహసిల్దార్ విద్యాసాగర్‌కు వినతిపత్రం అందజేశారు. సోమవారం ఉల్లి క్వింటాకు రూ.3000 మద్దతు ధర ఇవ్వాలని కోరారు. వర్షాల వల్ల దిగుబడి తగ్గినదీ, మార్కెట్‌లో ధర రూ.200-500కి పరిమితమైందని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.