పిల్లల దత్తత అంశంలో నిబంధనలు అనుసరించాలని అధికారులను అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ ఆదేశించారు. పిల్లల దత్తత అంశానికి సంబంధించి మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఫోస్టర్ అడాప్షన్ కేర్ పోస్టర్లను శుక్రవారం ఆయన పాడేరులోని ఐటీడీఏ కార్యాలయంలో ఆవిష్కరించారు. తల్లిదండ్రులు లేని ఆరేళ్లు పైబడి 18 ఏళ్ల లోపు ఉన్న పిల్లలను రెండేళ్ల పాటు పెంచి, ప్రేమానురాగాలు పంచిన అనంతరం శాశ్వత దత్తత కల్పించాలని సూచించారు.