రైతులందరికీ కూడా బయోమెట్రిక్ ఆధారంగానే ఎరువులను పంపిణీ చేయాలని అనంతపురం జిల్లా విడపనకల్లు మండల వ్యవసాయ శాఖ అధికారి పెన్నయ్య సూచించారు. ఆదివారం మండల వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ తో కలిసి ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేసి ఎరువులు ఉన్న గోదాములనుఏ ఓ పరిశీలించారు. ముఖ్యంగా యూరియా పంపిణీ పై డీలర్లకు సలహాలు సూచనలను అందజేశారు. పంటల వారీగా యూరియా వినియోగంపై పోస్టర్లను దుకాణాల వద్ద ఏర్పాటు చేయాలన్నారు. యూరియాను, ఇతర ఎరువులను ఎమ్మార్పీ ధరల కన్నా ఎక్కువ వికరిస్తే చర్యలు తప్పవన్నారు. అనంతరం ఎరువుల గోదాములను పరిశీలించారు.