వినాయక చవితి సందర్భంగా కడప మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది. బుధవారం ఐటీఐ సర్కిల్ వద్ద పూజా సామగ్రి, విగ్రహాల కొనుగోలు, పూలు, పండ్ల ధరలు ఆకాశాలుంటాయంటూ వాపోయారు. నిన్నటి వరకు ఒక్కో విగ్రహం రూ.50, 70 వరకు అమ్మగా బుధవారం రూ 150-200 వరకు విక్రయిస్తున్నారు. పూలు మూర రూ.80 ఉన్నాయి. దీంతో పండుగలు భారంగా మారాయని వినియోగదారులు వాపోతున్నారు.