ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా నిర్మించుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని గృహాలను నిర్మించుకోవాలని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. విజయపాల్ రెడ్డి పాల్వంచ మండలంలోని ఇస్సాయిపేట్, పాల్వంచ గ్రామాలలో మరియు మాచారెడ్డి మండలంలోని లక్ష్మీరావులపల్లి గ్రామంలోని వివిధ నిర్మాణదశలలో నిర్మాణంలో ఉన్న ఇండ్లను పర్యటించి లబ్ధిదారులకు ఇందిరమ్మ కమిటీ మెంబర్లకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమునకు సంబంధించి పూర్తి అవగాహన కల్పించినారు. వారి యొక్క సందేహములను నివృత్తి పరిచారు. లబ్ధిదారులకు ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ : 18005995991 కు సంప్రదించాలని తెలియజేశారు.