నూజివీడు ట్రిపుల్ ఐటీ లో లేబరేటరీ పరీక్షకు అనుమతించకపోవడంతో ఎంటెక్ విద్యార్థి వినయ్ పురుషోత్తం అనే విద్యార్థి ప్రొఫెసర్ గోవిందరాజుపై కత్తితో దాడి చేసినట్లు డి.ఎస్.పి కే వి వి ఎన్ వి ప్రసాద్ తెలిపారు. నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్ లో సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు. ఎంటెక్ లో 75% అటెండెన్స్ లేకపోవడంతో పరీక్షకు అనుమతి లేదనడంతో కత్తితో దాడి చేసినట్లు తెలిపారు. సోమవారం రాత్రి దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు డి.ఎస్.పి తెలిపారు